వాతాపి గణపతిం భజేహం: కర్ణాటక సంగీతంలోని అత్యంత ప్రసిద్ధ కృతి

సంగీత ప్రపంచంలో “వాతాపి గణపతిం భజేహం – Vatapi Ganapatim Bhaje” కృతి ఒక విశేష స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణ భారత సంగీత సంప్రదాయమైన కర్ణాటక సంగీతంలో (Carnatic Music) అత్యంత ప్రసిద్ధమైన కృతులలో ఇది ఒకటి. సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితార్ (Muthuswami Dikshitar) హంసధ్వని రాగం, ఆది తాళంలో గానాన్ని రచించినారు. ముత్తుస్వామి దీక్షితార్ అత్యుత్తమ రచనలలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కృతి ఎంత ప్రాచుర్యం పొందిందంటే, కర్ణాటక సంగీత కచేరీలలో ప్రథముముగా పాడే స్తుతి గీతాలలో ఇదీ ఒకటి.
కీర్తి ప్రతిష్టలు
కర్ణాటక సంగీత కచేరీలలో సంప్రదాయబద్ధంగా ఈ స్తుతి గీతాన్ని మొదట పాడుతారు. వాతాపి గణపతిం భజేహం, కర్ణాటక సంగీతం మరియు నృత్యం (Music and Dance) నేర్చుకొనే విద్యార్థులు మొదటి కృతులలో ఇది ఒకటి. కర్ణాటక సంగీత అభ్యాసం చేయు విద్యార్థులు ఈ కృతిని ప్రారంభ దశలోనే అభ్యసిస్తారు. సంగీత కచేరీలలో ఈ కృతిని పాడటం వెనుక ఆధ్యాత్మిక కారణం ఉన్నది. హిందూ మతములో ప్రతి కార్యాలకు మొదటగా శ్రీ వినాకుడిని (Vinayaka) ఆరాధించడం సాంప్రదాయముగా ఉన్నది. కావున శ్రీ విఘ్నేశ్వరుడిని కొలుస్తూ వాతాపి గణపతిం పాడడం జరుగుతుంది.
వాతాపి గణపతిం భజేహం, హంసధ్వని రాగంలో రూపొందింది. నృత్యకారులు మరియు సంగీత విద్వాంసులు ఈ కృతిని మధురమైన స్వరంతో గాన చేస్తూ, నృత్యకారులు శ్రీ గణేషుడిని (Ganesh Ji) కొలుస్తూ ఆకర్షణగా నృత్యం చేస్తారు. ఈ కృతి పాడటానికి చిన్నదిగా, సులువుగా ఉండును.
Vatapi Ganapatim Bhaje Telugu
వాతాపి గణపతిం భజేహం తెలుగు
రాగం: హంసధ్వని (స, రి2, గ3, ప, ని3, స)
వాతాపి గణపతిం భజేఽహం
వారణాశ్యం వరప్రదం శ్రీ ।
భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణమ్ ।
వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణమ్ ।
పురా కుంభ సంభవ మునివర
ప్రపూజితం త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రస్థితమ్ ।
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజవామకర విద్రుతేక్షుఖండమ్ ।
కరాంబుజ పాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబమ్ ।
Credits : @vkrishnamurthy8142
Read Latest Post:
- Tripura Sundari Pancharatna Stotra | ತ್ರಿಪುರಸುಂದರೀ ಪಂಚರತ್ನ ಸ್ತೋತ್ರ
- Tripura Sundari Pancharatna Stotram | త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం
- Sri Durga Saptashloki । ಶ್ರೀ ದುರ್ಗಾ ಸಪ್ತ ಶ್ಲೋಕೀ
- Sri Durga Saptashloki | శ్రీ దుర్గా సప్త శ్లోకీ
- Anantha Padmanabha Vratham – అనంత పద్మనాభ వ్రతం
- Arjuna Kruta Durga Stotram – అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రం