గణేశ షోడశ నామావళి: శక్తిమంతమైన 16 నామాలు
“గణేశ షోడశ నామావళి” “Ganesha Shodasha Namavali” అంటే శ్రీ మహాగణపతి (Maha Ganapati) పదహారు నామాల జాబితా. ప్రతి నామానికి ಒక విశిష్ట అర్థం ఉండి, ఆ నామాన్ని జపించడం ద్వారా ఆ విశిష్ట ఫలితం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. “గణేశ షోడశనామ స్తోత్రం” “Ganesha Shodashanama Stotram” వలె కాకుండా, ఇందులో కేవలం నామాల జాబితా మాత్రమే ఉంటుంది.
గణేశ షోడశ నామావళి యొక్క ప్రాముఖ్యత
సరళ పద్ధతి
- గణేశ షోడశ నామావళి పఠించడం చాలా సులభమైన మార్గం. ఎప్పుడైనా, ఎక్కడైనా కేవలం పదహారు నామాలను జపించడం ద్వారా శ్రీ గణేశుని (Ganesh Ji) ఆశీర్వాదం పొందవచ్చు.
వివిధ ప్రయోజనాలు
- గణేశ షోడశ నామావళిలోని ప్రతి నామానికి ఒక అర్థం ఉంది. “సుముఖ” అనే నామం శుభ రూపాన్ని సూచిస్తుంది. “విఘ్నరాజ” అనే నామం విఘ్నాలకు రాజు అని అర్థం. అంటే, ఆ నామాన్ని జపించడం ద్వారా విఘ్నాలు (అవాంతరాలు/Hurdles, కష్టాలు) తొలగిపోతాయని నమ్మకం. ఇలా ప్రతి నామానికి వివిధ ప్రయోజనాలు ఉన్నాయి.
ఆధ్యాత్మిక అభివృద్ధి
- ప్రతి రోజు గణేశ షోడశ నామావళిని జపించడం అలవాటు చేసుకోవడం ద్వారా మనస్సు ఏకాగ్రత (Concentration) సాధించడానికి సహాయపడుతుంది. ఫలితంగా, ఆధ్యాత్మిక మార్గంలో పరిణామం సాధించడానికి దోహదపడుతుంది.
విజయానికి మార్గం
- ఈ స్తోత్రాన్ని నిష్ట భక్తితో పఠించడం ద్వారా ఏ కార్యంలోనైనా విజయం సాధించవచ్చని భక్తులు నమ్ముతారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు (Political) వంటి క్షేత్రాలలో విజయం సాధించడానికి ఈ స్తోత్రం ఎంతో మంచిదని విశ్వసిస్తారు.
ఐహిక, ఆధ్యాత్మిక శుభాలు
- గణేశ షోడశనామ స్తోత్రం పఠించడం ద్వారా ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి వంటి ఐహిక సుఖాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా, ఈ స్తోత్రంలోని మంత్రాలు మన మనస్సును ఏకాగ్రపరచడానికి సహాయపడతాయి. ఫలితంగా, ఆధ్యాత్మిక పరిణామం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది
శ్రీ గణేశ షోడశనామ స్తోత్రం | Ganesha Shodashanama Stotram
గణేశ షోడశనామ స్తోత్రం అనేది శ్రీ మహాగణేశుడి పదహారు నామాలను స్తుతిస్తూ ఆయన కృప కోసం చేసే ఒక ప్రత్యేకమైన స్తోత్రం. ఈ స్తోత్రం గణేశ షోడశ నామావళి యొక్క సంక్షిప్త రూపం. ఈ స్తోత్రంలో శ్రీ గణేశుని వివిధ శక్తులు, గుణాలు వర్ణించబడి, ఆయన ఆశీర్వాదం పొందడానికి ప్రార్థించడం జరుగుతుంది.
శ్రీ గణేశ షోడశ నామావళి కానీ శ్రీ గణేశ షోడశనామ స్తోత్రం ఒక్కటే. ఏదైనా సులభ మార్గంగా ఉంటుంది, కావున ఏది అనుకూలమైతే దాని ప్రతిరోజూ పఠించి శ్రీ వినాయకుడి (Vinayaka) ఆశీర్వాదములను పొందవచ్చు.
Ganesha Shodasha Namavali Telugu
గణేశ షోడశ నామావళి తెలుగు
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
Ganesha Shodashanama Stotram Telugu
శ్రీ గణేశ షోడశనామ స్తోత్రం తెలుగు
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥
ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥
గణేశ షోడశ నామావళి తెలుగు వీడియో
Credits: @BhaktiOne
శ్రీ గణేశ షోడశనామ స్తోత్రం తెలుగు వీడియో
Credits: @BhaktiOne
Read Latest Post: