గణేశ అష్టోత్తర శత నామావళి: విఘ్నాల నాశనం, శుభాల అభివృద్ధికి దివ్య మంత్ర జపం

హిందూ సాంప్రదాయంలో విఘ్న నివారణ దేవుడిగా పూజించబడే శ్రీ మహాగణపతిని (Mahaganapati) స్తుతించే ఘనమైన స్తోత్రాల్లో “గణేశ అష్టోత్తర శత నామావళి” “Ganesha Ashtottara Sata Namavali” ఒకటి. ఈ స్తోత్రంలో 108 నామాలు ఉన్నాయి, ప్రతి నామం శ్రీ గణేశుని (Ganesha) యొక్క విశేష లక్షణాలు, మహిమలను తెలియజేస్తుంది. ఏదేని కార్యక్రమాలకు, పూజలకు సంకల్పాలకు ముందు, ఏ శుభకార్యం ప్రారంభించే ముందు ఆరాధించే ప్రధాన దేవత శ్రీ మహాగణపతి. బుద్ధి, సిద్ధి ప్రదాత అయిన గణేశుడు, విఘ్నాలకు రాజు (విఘ్నరాజు) గా కూడా పేరుగాంచాడు. ఏ కార్యం ప్రారంభించినా, శుభాకాంక్షల సమయంలోనూ మొదటగా ఆరాధించే దేవత శ్రీ మహాగణపతి. ఆయనను “గణాధిపతి” అని కూడా పిలుస్తారు, అంటే గణాలకు అధిపతి. బుద్ధి, సిద్ధి ప్రదాత అయిన విఘ్నేశ్వరుడు మన జీవితాలలోని అడ్డంకులను తొలగించి, సాఫల్యతలకు మార్గం సుగమం చేస్తాడు. భక్తులు పూర్ణ భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా గణపతి అనుగ్రహాన్ని పొంది, జీవితంలో శుభ ఫలితాలను అనుభవించగలరని విశ్వసిస్తారు.
గణేశ అష్టోత్తర శత నామావళి యొక్క ప్రాముఖ్యత:
- గణపతి అనుగ్రహం: ఈ స్తోత్రాన్ని జపించడం ద్వారా భక్తులు శ్రీ గణేశుని కరుణ, అనుగ్రహం పొందుతారని నమ్మకం. ఆయన వారి జీవితంలోని అవాంతరాలను, బాధలను తొలగించి, శుభాలను అందించే శక్తి ఉన్నదని భక్తులు విశ్వసిస్తారు.
- విఘ్న నివారణ: జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు, కష్టాలు (విఘ్నాలు) తొలగించడానికి ఈ స్తోత్రం పఠించడం ఎంతో మంచిదని భక్తులు నమ్ముతారు. గణేశుడు విఘ్నాలకు రాజు అయినప్పటికీ, ఆయననే ఆ విఘ్నాలను పరిహరించే శక్తి కూడా కలిగి ఉంటాడు.
- ఐహిక, ఆధ్యాత్మిక శుభాలు: గణేశుడు ఐశ్వర్యానికి, బుద్ధికి అధిపతి. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా భక్తులు సంపద, ఆరోగ్యం, విద్య, సంతానం వంటి ఐహిక శుభాలను పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక పరిణామం సాధించి, మోక్షాన్ని (జన్మ – మరణాల చక్రం నుండి విముక్తి) పొందే మార్గంగా కూడా పరిగణిస్తారు.
ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించడం ద్వారా శ్రీ మహాగణపతి కరుణ ప్రసరించి, ఆయన ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ఆ ఆశీస్సుల తో ఐశ్వర్యం (Wealth), ఆరోగ్యం (Health), విద్య (Education), సంతానం (Childrens) వంటి ఐహిక సుఖాలు కలుగుతాయని నమ్మకం.
Ganesha Ashtottara Sata Namavali Telugu
గణేశ అష్టోత్తర శత నామావళి తెలుగు
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
Credits: @hithokthitelugu
Read Latest Post:
- Tripura Sundari Pancharatna Stotram | త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం
- Arjuna Kruta Durga Stotram – అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రం
- Maha Mrityunjaya Stotram – మహా మృత్యుంజయ స్తోత్రం
- Nirvana Shatkam | నిర్వాణషట్కం
- Shiva Panchakshari Stotram | శివ పంచాక్షరి స్తోత్రం
- Kasi Vishwanathashtakam | కాశీ విశ్వనాథాష్టకం