భక్తుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, జీవితంలో శాంతి, శ్రేయస్సు సాధించడానికి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి (Sri Swarna Akarshana Bhairava Ashtottara Sata Namavali) ఒక ప్రసిద్ధ స్తోత్రం. భక్తులు సంపద, శాంతి, శ్రేయస్సు, విజయం కోసం ఆరాధించే శక్తివంతమైన దివ్య రూపం శ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు. ఆయన కరుణను, అనుగ్రహాన్ని అందినీయడానికి 108 నామాలతో కూడిన ఈ స్తోత్రాన్ని భక్తులు పఠిస్తారు. సంస్కృత (Sanskrit) భాషలో రాసి ఉన్న ఈ స్తోత్రం, భైరవుని (Bhairava) అద్భుత శక్తులు, గుణాలను కీర్తిస్తుంది.
ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా, ఆర్థిక సంపద (Financial), వృద్ధి కలుగుతాయని నమ్ముతారు. “స్వర్ణాకర్షణ” అనే పదానికి “బంగారు ఆకర్షణ” అని అర్థం. అంటే, ఈ స్తోత్రం పఠించడం ద్వారా భక్తులు ఐశ్వర్యాన్ని, సుసంపన్నమైన జీవితాన్ని పొందగలరని భావిస్తారు. అంతేకాకుండా, ఈ స్తోత్రం నందు మనశ్శాంతిని, ప్రశాంతతను (Peace of Mind) అందించి, జీవితంలోని కష్టాలను దూరం చేస్తుంది. విజయం సాధించాలని, శత్రువుల నుండి రక్షణ పొందాలని కోరుకునే వారు కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తారు.
ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు కొన్ని విధివిధానాలు పాటించడం మంచిది. సాధారణంగా ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయ తరువాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పఠించడం శ్రేయస్కరం. భైరవుని చిత్రపటం లేదా విగ్రహం ముందు కూర్చోని పుష్పాలు, అగరబత్తి సమర్పించుకోవచ్చు. ఆ తరువాత స్తోత్రంలోని ప్రతి నామాన్ని స్పష్టంగా, శ్రద్ధగా ఉచ్చరించాలి. అర్థం తెలిస్తే మరింత మంచిది. స్తోత్రం పూర్తి చేసిన తరువాత మనసులో భైరవునికు మొక్కులు చెల్లించుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా, మనసును ఏకాగ్రతపరచడానికి కూడా ఈ స్తోత్రం సహాయపడుతుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
Sri Swarna Akarshana Bhairava Ashtottara Sata Namavali
శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి తెలుగు
ఓం భైరవేశాయ నమః .
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మనే నమః
ఓం త్రైలోక్యవంధాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరాత్మనే నమః
ఓం రత్నసింహాసనస్థాయ నమః
ఓం దివ్యాభరణశోభినే నమః
ఓం దివ్యమాల్యవిభూషాయ నమః
ఓం దివ్యమూర్తయే నమః
ఓం అనేకహస్తాయ నమః ॥ 10 ॥
ఓం అనేకశిరసే నమః
ఓం అనేకనేత్రాయ నమః
ఓం అనేకవిభవే నమః
ఓం అనేకకంఠాయ నమః
ఓం అనేకాంసాయ నమః
ఓం అనేకపార్శ్వాయ నమః
ఓం దివ్యతేజసే నమః
ఓం అనేకాయుధయుక్తాయ నమః
ఓం అనేకసురసేవినే నమః
ఓం అనేకగుణయుక్తాయ నమః ॥20 ॥
ఓం మహాదేవాయ నమః
ఓం దారిద్ర్యకాలాయ నమః
ఓం మహాసంపద్ప్రదాయినే నమః
ఓం శ్రీభైరవీసంయుక్తాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం దైత్యకాలాయ నమః
ఓం పాపకాలాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః ॥ 30 ॥
ఓం దివ్యచక్షుషే నమః
ఓం అజితాయ నమః
ఓం జితమిత్రాయ నమః
ఓం రుద్రరూపాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం అనంతవీర్యాయ నమః
ఓం మహాఘోరాయ నమః
ఓం ఘోరఘోరాయ నమః
ఓం విశ్వఘోరాయ నమః
ఓం ఉగ్రాయ నమః ॥ 40 ॥
ఓం శాంతాయ నమః
ఓం భక్తానాం శాంతిదాయినే నమః
ఓం సర్వలోకానాం గురవే నమః
ఓం ప్రణవరూపిణే నమః
ఓం వాగ్భవాఖ్యాయ నమః
ఓం దీర్ఘకామాయ నమః
ఓం కామరాజాయ నమః
ఓం యోషితకామాయ నమః
ఓం దీర్ఘమాయాస్వరూపాయ నమః
ఓం మహామాయాయ నమః ॥ 50 ॥
ఓం సృష్టిమాయాస్వరూపాయ నమః
ఓం నిసర్గసమయాయ నమః
ఓం సురలోకసుపూజ్యాయ నమః
ఓం ఆపదుద్ధారణభైరవాయ నమః
ఓం మహాదారిద్ర్యనాశినే నమః
ఓం ఉన్మూలనే కర్మఠాయ నమః
ఓం అలక్ష్మ్యాః సర్వదా నమః
ఓం అజామలవద్ధాయ నమః
ఓం స్వర్ణాకర్షణశీలాయ నమః
ఓం దారిద్ర్య విద్వేషణాయ నమః ॥ 60 ॥
ఓం లక్ష్యాయ నమః
ఓం లోకత్రయేశాయ నమః
ఓం స్వానందం నిహితాయ నమః
ఓం శ్రీబీజరూపాయ నమః
ఓం సర్వకామప్రదాయినే నమః
ఓం మహాభైరవాయ నమః
ఓం ధనాధ్యక్షాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ఆదిదేవాయ నమః ॥ 70 ॥
ఓం మంత్రరూపాయ నమః
ఓం మంత్రరూపిణే నమః
ఓం స్వర్ణరూపాయ నమః
ఓం సువర్ణాయ నమః
ఓం సువర్ణవర్ణాయ నమః
ఓం మహాపుణ్యాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం సంసారతారిణే నమః
ఓం ప్రచలాయ నమః ॥ 80 ॥
ఓం బాలరూపాయ నమః
ఓం పరేషాం బలనాశినే నమః
ఓం స్వర్ణసంస్థాయ నమః
ఓం భూతలవాసినే నమః
ఓం పాతాలవాసాయ నమః
ఓం అనాధారాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం స్వర్ణహస్తాయ నమః
ఓం పూర్ణచంద్రప్రతీకాశాయ నమః
ఓం వదనాంభోజశోభినే నమః ॥ 90 ॥
ఓం స్వరూపాయ నమః
ఓం స్వర్ణాలంకారశోభినే నమః
ఓం స్వర్ణాకర్షణాయ నమః
ఓం స్వర్ణాభాయ నమః
ఓం స్వర్ణకంఠాయ నమః
ఓం స్వర్ణాభాంబరధారిణే నమః
ఓం స్వర్ణసింహానస్థాయ నమః
ఓం స్వర్ణపాదాయ నమః
ఓం స్వర్ణభపాదాయ నమః
ఓం స్వర్ణకాంచీసుశోభినే నమః ॥ 100 ॥
ఓం స్వర్ణజంఘాయ నమః
ఓం భక్తకామదుధాత్మనే నమః
ఓం స్వర్ణభక్తాయ నమః
ఓం కల్పవృక్షస్వరూపిణే నమః
ఓం చింతామణిస్వరూపాయ నమః
ఓం బహుస్వర్ణప్రదాయినే నమః
ఓం హేమాకర్షణాయ నమః
ఓం భైరవాయ నమః ॥ 108 ॥
॥ ఇతి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణమ్ ॥
Credits: @hithokthitelugu
Read More Post: