శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం |Sri Samba Sadashiva Aksharamala Stotram

మాతృక వర్ణమాలికా స్తోత్రంMatruka Varnamalika Stotram

Sri Samba Sadashiva Aksharamala Stotram

ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే దివ్య మార్గం

హిందూ సాంప్రదాయంలో, శివుడు (Lord Shiva) సృష్టి, స్థితి, లయలకు నిదర్శన. ఆయనను పరమ శివుడు, విశ్వనాథుడు (Vishwanath), ఐశ్వర్యదాత అని కూడా కొలుస్తారు. భక్తులు ఆయన అనుగ్రహం కోసం అనేక మార్గాలను అనుసరిస్తారు, వాటిలో శక్తివంతమైన స్తోత్రాల జపం నందు Sri Samba Sadashiva Aksharamala Stotram ఒకటి. ఈ స్తోత్రన్ని Matruka Varnamalika Stotram కూడా పిలుస్తారు. ఈ రోజు మనం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే అద్భుతమైన స్తోత్రం “శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం” లేక “మాతృక వర్ణమాలికా స్తోత్రం”. 

అనంత శక్తిగల స్తోత్రం

ఈ స్తోత్రం ఆది శంకరాచార్యులచే (Adi Shankaracharya) రచించబడినది.  ప్రతి పద్యం అక్షర వర్ణమాల (Varnamala)నందు కల ఒక అక్షరంతో ప్రారంభాక్షరంగా ఉంటుంది. ఇలా అక్షరాల సరణిలో సాగే ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీ సాంబ సదాశివుని (Samba Sadashiva) కరుణ, అనుగ్రహం పొందడానికే కాకుండా, ఆధ్యాత్మిక పరిణామానికి ఈ స్తోత్రం దోహదపడుతుంది.

స్తోత్ర పఠనం యొక్క ప్రయోజనాలు

  • పాప విముక్తి: నిష్టతో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల పాపాలు తొలగిపోయి, మోక్ష సాధనకు దగ్గరవుతారని నమ్ముతుంటారు.
  • ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల: స్తోత్ర పఠనం ద్వారా శివ తత్వాన్ని ధ్యానించడం, ఆయన అనంత శక్తిలో మనకు కూడా కొంత శక్తి కొరకు సహాయపడుతుంది.
  • శుభం, శాంతి, సంపదలు: భక్తుల మనసుల్లో శాంతి నెలకొల్పడానికి, జీవితాల్లో శుభం కలగడానికి, సంపదలు చేకూరడానికి ఈ స్తోత్రం దోహదపడుతుంది.
  • శివ అనుగ్రహం: శ్రద్ధా భక్తితో స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీ సాంబ సదాశివుని అనుగ్రహం లభించి, ఆయన ఆశీస్సులు మనపై ఉంటాయని విశ్వసిస్తారు.

శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, మనసుకు శాంతిని అందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీ సాంబ సదాశివుని కరుణ, అనుగ్రహం పొందవచ్చు. మీరు ఈ స్తోత్రాన్ని మీ దినచర్యలో చేర్చుకుని, దాని అద్భుతమైన ప్రయోజనాలను అనుభవించండి.

Sri Samba Sadashiva Aksharamala Stotram (Matruka Varnamalika Stotram)

శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా స్తోత్రం (మాతృక వర్ణమాలికా స్తోత్రం)

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ॥

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ ॥

ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ ॥

ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ॥

ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవితపాద శివ ॥

ఉరగాదిప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ ॥

ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ ॥

ఋగ్వేదశ్రుతిమౌళివిభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ ॥

ౠపమనాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ ॥

లింగస్వరూప సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశ శివ ॥

లూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియవేద్య శివ ॥

ఏకానేకస్వరూప విశ్వేశ్వర యోగిహృదిప్రియవాస శివ ॥

ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ ॥

ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశ శివ ॥

ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ ॥

అంబరవాస చిదంబరనాయక తుంబురునారదసేవ్య శివ ॥

ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివ ॥

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ ॥

ఖడ్గశూలమృగఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశ శివ ॥

గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ॥

ఘాతకభంజన పాతకనాశన గౌరిసమేత గిరీశ శివ ॥

ఙఙాశ్రితశ్రుతిమౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశ శివ ॥

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ ॥

ఛత్రకిరీటసుకుండలశోభిత పుత్రప్రియ భువనేశ శివ ॥

జన్మజరామృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ ॥

ఝంకారాశ్రయ భృంగిరిటిప్రియ ఓంకారేశ మహేశ శివ ॥

జ్ఞానాజ్ఞానవినాశక నిర్మల దీనజనప్రియ దీప్త శివ ॥

టంకాద్యాయుధధారణ సత్వర హ్రీంకారైది సురేశ శివ ॥

ఠంకస్వరూపా సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ ॥

డంబవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ ॥

ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయకసేవ్య శివ ॥

ణళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ ॥

తత్త్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానంద మహేశ శివ ॥

స్థావర జంగమ భువనవిలక్షణ భావుకమునివరసేవ్య శివ ॥

దుఃఖవినాశన దలితమనోన్మన చందనలేపితచరణ శివ ॥

ధరణీధర శుభ ధవళవిభాస్వర ధనదాదిప్రియదాన శివ ॥

నానామణిగణభూషణ నిర్గుణ నటనజనసుప్రియనాట్య శివ ॥

పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ ॥

ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ ॥

బంధవినాశన బృహదీశామరస్కందాదిప్రియ కనక శివ ॥

భస్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశ శివ ॥

మన్మథనాశన మధుపానప్రియ మందరపర్వతవాస శివ ॥

యతిజనహృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశ శివ ॥

రామేశ్వర రమణీయముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ ॥

లంకాధీశ్వర సురగణసేవిత లావణ్యామృతలసిత శివ ॥

వరదాభయకర వాసుకిభూషణ వనమాలాదివిభూష శివ ॥

శాంతిస్వరూప జగత్త్రయ చిన్మయ కాంతిమతీప్రియ కనక శివ ॥

షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాదిసమేత శివ ॥

సంసారార్ణవనాశన శాశ్వతసాధుహృదిప్రియవాస శివ ॥

హర పురుషోత్తమ అద్వైతామృతపూర్ణ మురారిసుసేవ్య శివ ॥

ళాళితభక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ ॥

క్షరరూపాదిప్రియాన్విత సుందర సాక్షిజగత్త్రయ స్వామి శివ ॥

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ॥

ఇతి శ్రీసాంబసదాశివ మాతృకావర్ణమాలికా స్తోత్రమ్ ।

Read Latest Post:

Leave a Comment